ముఖ్యమంత్రిని కలిసిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జల సంరక్షణలో ‘జల్ సంచయ్.. జన్ భాగీదారీ’ జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డును మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 6వ నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అందుకున్నారు. జలమండలికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’10 టాప్ మున్సిపల్ కార్పొరేషన్’ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 అవార్డ్ అందించారు. ఈ అవార్డులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల ప్రోత్సాహక బహుమతిని జలమండలికి అందిస్తారు. బుధవారం తెలంగాణ సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్న ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్(ఆపరేషన్స్ -1), వినోద్ భార్గవ, కేంద్ర నోడల్ అధికారి జల్ శక్తి అభియాన్ కిరణ్ రెడ్డి, సెంట్రల్ గ్రౌండ్‌వాటర్ బోర్డు సైంటిస్ట్ డా.సుధీర్ కుమార్, జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘జల్ సంచయ్..జన్ భాగీదారీ’ జాతీయ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



