నవతెలంగాణ – హైదరాబాద్: 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉండనున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చిందని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఫ్యూచర్ సిటీకి 500-700 ఎకరాలు ఇవ్వనున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
‘‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు.. ఆయకు భారతరత్న ఇవ్వలి.. అమీర్‌పేటలో ఆయన విగ్రహం పెట్టి తీరుతాం అని సీఎం అన్నారు. నూటికి నూరు శాతం మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదు. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం నాకు అవసరం లేదు. ఎస్‌ఐబీ ఫిర్యాదుతోనే ఆ కేసు దర్యాప్తు జరుగుతోంది. కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీబీఐకి ఇస్తాం. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. 2018లో తెచ్చిన నిబంధనల మేరకే సింగరేణిలో టెండర్లు. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో పెడతాం. ఆరోపణలు తప్పని తేలితే కిషన్‌రెడ్డి క్షమాపణలు చెబుతారా? సింగరేణికి కేసీఆర్ పెట్టిన బకాయిలే ఎక్కువ. సింగరేణి విషయంలో కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు. ఆయన నన్ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు లేరు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి 6 నెలలు అయ్యింది. దీనిపై కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును త్వరలోనే సీబీఐకి ఇస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



