Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చింతల్ క్రాస్ వద్ద పొంగిపొర్లుతున్న జంపన్న వాగు..

చింతల్ క్రాస్ వద్ద పొంగిపొర్లుతున్న జంపన్న వాగు..

- Advertisement -

ఎల్బాక, పడిగాపురానికి రాకపోకలు బంద్..
చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగు పొంగిపొర్లుతుంది. మంగళవారం సాయంత్రం నుండి  కురిసిన వర్షానికి మేడారం జంపన్న వాగు తీవ్ర రూపం దాల్చింది. జంపన్న వాగులో ఉన్న బావులు మునిగే స్థాయికి చేరుకుంది. నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో బుధవారం ఉదయం నుండి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంగలమ్మడుగు నీరు ఇప్పుడే చేరుతుంది. కొంగల మడుగు ఎక్కువ ప్రవహిస్తే ఈ రెండు ఆదివాసి గ్రామాలు జలదిగ్బంధంలో నిలిచిపోతాయి.

చింతల్ క్రాస్ జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి 

మేడారం జాతర పేరు మీద కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. తాత్కాలిక మరమ్మతులో పనులకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. మేడారం జాతరకు, జాతర అనంతరం ఎల్బక, పడిగాపూర్ గ్రామాలకు, దానిపై నిరంతరం భక్తులు కూడా రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా బహుళార్థ ప్రయోజనాలు కలుగుతాయి, కనక నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలు బంద్ అయి బిక్కుబిక్కుమందు గడపాల్సిన పరిస్థితులు. మంత్రి సీతక్క ఇట్టి విషయాన్ని పరిశీలించి చింతల్ క్రాస్ వద్ద గల జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -