Sunday, January 18, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపాల్టీ బరిలో జనసేన

మున్సిపాల్టీ బరిలో జనసేన

- Advertisement -

– 22 వార్డుల్లో నూ పోటీ, జిల్లా నాయకులు కార్తీక్
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాల్టీ బరి లో జనసేన ఉంటుందని,కొత్తవారికి,యువకులకు అవకాశం కల్పిస్తామని పార్టీ జిల్లా ఇంచార్జి వేముల కార్తీక్ ప్రకటించారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సాయి రంగా ఫంక్షన్ లో నియోజక ఇంచార్జి డేగల రామచంద్రరావు అద్యక్షతన ఆదివారం నిర్వహించిన మున్సిపాల్టీ ఎన్నికల నిర్వహణ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కార్తీక్ మాట్లాడుతూ.. 22 వార్డుల్లో నూ అభ్యర్ధులను నిలుపుతామని,బీసీ ల సత్తా చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట అసెంబ్లీ జనసేన పోటీ అభ్యర్ధి ముయ్యబోయిన ఉమాదేవి,అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి మండలాల అద్యక్షులు ఇస్లావత్ వినోద్ కుమార్, రహీమ్,ప్రవీణ్,కిషోర్,  జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -