వర్ధన్నపేట లో జరిగే జనహిత పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పాలకుర్తి ప్రజలు తరలిరావాలి
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టిపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే టిపిసిసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జనహిత పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని, ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారానికి బలమైన వేదికగా జనహిత పాదయాత్ర దోహదపడుతుందని తెలిపారు. చిన్నహిత పాదయాత్ర ప్రజా ఉద్యమంలో మారాలని, ప్రతి కార్యకర్త జనహిత పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని, ప్రజా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణ మరింత శక్తిని ఇస్తుందని తెలిపారు.
జనహిత పాదయాత్ర ద్వారా మహిళల సమస్యలు, గిరిజన ప్రాంతాల సమస్యలు, రైతుల సమస్యలు, యువత అభ్యున్నతి అంశాలను నేరుగా ప్రజలతో చర్చిస్తారని తెలిపారు. జనహిత పాదయాత్ర తో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో ప్రజలకు మరింత చేరువై, సమస్యల పరిష్కారానికి వేదికగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 24 కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాల కోసం గృహ జ్యోతి పథకంలో ఉచిత విద్యుత్ పథకం, ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళల అభ్యున్నతి కోసం వడ్డీ లేని రుణాలు, లోను భీమ లాంటి పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన జనహిత పాదయాత్ర ఈనెల 25న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకుంటుందని, 26న వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర ఉంటుందని తెలిపారు. జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జనహిత పాదయాత్రకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, జిల్లా నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, గోనె మహేందర్ రెడ్డి, బండిపెళ్లి మణమ్మ, గాయాల రవి తదితరులు పాల్గొన్నారు.