Friday, May 16, 2025
Homeసినిమా'జనం' రీ- రిలీజ్‌కి రెడీ

‘జనం’ రీ- రిలీజ్‌కి రెడీ

- Advertisement -

వీఆర్‌పీ క్రియేషన్స్‌ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో సుమన్‌, అజరు ఘోష్‌, కిషోర్‌, వెంకటరమణ, ప్రగ్య నైనా నటించిన చిత్రం ‘జనం’. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 29న రీ-రిలీజ్‌ కాబోతుంది. రాజకీయాలు, రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్‌ 10న థియేటర్లలో విడుదలై, సంచలనం సష్టించింది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటనలను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు. రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ, ‘అదుపు తప్పుతున్న నేటి తరానికి అవగాహన కోసం చక్కటి సినిమా అందిస్తున్నాం. ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకుల పంచే మందు, డబ్బులకు ఎలా బానిసలు అవుతున్నారో ఆలోచిం పచేసేలా సినిమాని తెరకెక్కించాం. ఈ సినిమాకు సుమన్‌ హీరో. పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఇందులో కమర్షియల్‌ అంశాలు, సందేశం, సెంటిమెంట్‌ , థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఈనెల 29న థియేటర్‌లకు వెళ్లి ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -