నవతెలంగాణ – పాలకుర్తి
జంజిరాల పౌర్ణమి (నూలు పోగుపౌర్ణమి)ని పురస్కరించుకొని శనివారం పాలకుర్తిలో పద్మశాలీలు భక్త మార్కండేయ మహర్షికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెనుగొండ రమేష్, చిలుకమారి ఉప్పలయ్య లు వారి ఇంటి నుండి పద్మశాలిలు బ్యాండ్ మేళాలతో గుడివాడ చౌరస్తాలో గల ఓంకారేశ్వర ఆలయం(పంచగుళ్ల) ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఓంకారేశ్వర ఆలయంలో (పంచగుళ్ల) ఆలయ అర్చకులు గంగు దీపక్ శాస్త్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామికి పంచామృతా భిషేకం ,గణపతి హోమము, యజ్ఞోపవిత ధారణ జరిపారు, అనంతరం పద్మశాలి లు అధికంగా జంజిరాలను. యజ్ఞోపవితాదారణ చేసి, గాయత్రీ మంత్రం షోడశ ఉపచార పూజతో, మార్కండేయ పూజతో ఉచ్చరించి భక్తి శ్రద్ధలతో జంజిరాలను ధరించారు.
నూలు పోగు ఉద్భవించిన పవిత్రమైన నూలు పౌర్ణమి, రక్షా బంధన్ ను పట్టణ పద్మశాలిలు ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్ మేడారపు సుధాకర్, పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు, పోపా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య , చేనేత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, కోశాధికారి చిలుకమారి సోమేశ్వర్, చిదురాల మార్కండేయ, చిలుకమారి వరప్రసాద్,కాటబత్తిని సోమేశ్వర్, వైట్ల పుండరీకుడు, పెనుగొండ వెంకటేశ్వర్లు,మేడారపు రామస్వామి,మేడారపు సోమనారాయణ,గజ్జెలి వెంకన్న, వల్లాల గౌరయ్య, ఎనగందుల శ్రీనివాస్, గూడెల్లి సోమశేఖర్, ఉపేందర్, చిలుకమారి రమేష్, వైట్ల శ్రీహరి, సత్యం, చిలుకమారి సమ్మయ్య, పెనుగొండ గౌరయ్య, సోమనాదం, ఉప్పలయ్య, వల్లాల స్వామి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES