Monday, December 29, 2025
E-PAPER
Homeజిల్లాలుజెడ్పీటీసీ బరిలో జంగా వంశీ యాదవ్ 

జెడ్పీటీసీ బరిలో జంగా వంశీ యాదవ్ 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ అధిష్టానం నాకు జెడ్పీటీసీ టికెట్ ఇస్తే బరిలో ఉంటానని మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన జంగ వంశీ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గెలుపు కోసం కృషి చేశానని అన్నారు. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల్లో కూడా ఎంపీ బలరాం నాయక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. అంతేకాకుండా పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతూ ముందుకు సాగుతున్నానని అన్నారు. అవసరమైతే నా సొంత ఖర్చులు పెట్టి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు. పార్టీ కోసం నేను పడ్డ కష్టాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, జిల్లా, మండల, గ్రామ, నాయకులు గుర్తించి, నాకు టికెట్ ఇస్తే నెల్లికుదురు నుండి జెడ్పీటీసీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -