Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమా'జటాధర' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘జటాధర’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించారు. మూవీ మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. నవంబర్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ డివైన్‌ ఎనర్జీతో ఉంది. సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్‌, ఇంద్రకష్ణ, రవి ప్రకాష్‌, నవీన్‌ నేని, రోహిత్‌ పాఠక్‌, ఝాన్సీ, రాజీవ్‌ కనకాల, సుభలేఖ సుధాకర్‌ లాంటి అద్భుత తారాగణం స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు. జీ స్టూడియోస్‌ సీబీఓ ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌ మాట్లాడుతూ,’ఇది సాధారణ సినిమా కాదు. ఇది ఒక గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. స్కేల్‌, స్టోరీ టెల్లింగ్‌, విజన్‌ పరంగా ఆడియన్స్‌ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాం’ అని తెలిపారు. ‘రుస్తమ్‌’ తర్వాత జీ స్టూడియోస్‌తో మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని గ్లోబల్‌ లెవెల్‌లో ప్రజెంట్‌ చేస్తున్నాం. ఇది ఎమోషనల్‌గా, విజువల్‌గా రేర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని ప్రేరణ అరోరా చెప్పారు. డైరెక్టర్స్‌ అభిషేక్‌ జైస్వాల్‌, వెంకట్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ,’ ఒక ఫోక్‌ టేల్‌ నుంచి పుట్టిన అద్భుతమైన కథ. డివైన్‌ పవర్‌, కాస్మిక్‌ డెస్టినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -