సమాజ్‌వాదీ నేత వెల్లడి
లక్నో : వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 26సీట్లను ఇవ్వనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఇరు పార్టీల మధ్య రెండో విడత సీట్ల సద్దుబాటు చర్చలు జరగడానికి ముందుగా ఆయన ఈ విషయం తెలియచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారి నివాసంలో చర్చలకు ముందుగా యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రు వీకరించారు. ఈ 26 సీట్లలో కాంగ్రెస్ గెలిచిన సీట్లు రెండు, రెండో స్థానంతో సరిపెట్టుకున్న నాలుగు సీట్లు వున్నాయని అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు కేవలం రెండువేల వరకు ఓట్లు వచ్చి, సమాజ్‌వాదీకి 60వేల నుంచి 70వేల మధ్యలో ఓట్లు వచ్చిన మరో 20 సీట్లను కూడా కాంగ్రెస్‌కు ఆఫర్ చేసినట్లు తెలిపారు. దీనిపై యూపీ మంత్రి దయాశంకర్ సింగ్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఆరెండు పార్టీలకు ఎలాంటి ఉమ్మడి లక్ష్యాలు లేవని వ్యాఖ్యానించారు.






కామెంట్లు (0)