Magazines

నేపాల్‌లో భూకంపం...

16 నిమిషాల క్రితం

నేపాల్‌లో
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత

భారత్ సహా ఐదు దేశాల్లో ప్రకంపనలు


ఇంఫాల్ : నేపాల్‌లో వరుస భూకంపాలు దడపుట్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం 7.02 గంటల సమయంలో కోసి ప్రావిన్స్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా ఉందని యూరోపియన్-మెడిటేరియన్ సెస్మలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ) వెల్లడించింది. భూకంప కేంద్రం భూగర్భంలో 20 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత 30 రోజుల్లో ఈ ప్రాంతంలో నమోదైన నాలుగు ప్రధాన భూకంపాల్లో ఇది ఒకటని జియోషేక్ కమ్యూనిటీ నెట్‌వర్క్ వెల్లడించింది.భూకంపం సంభవించిన తపేల్‌జంగ్ ప్రాంతం తూర్పు నేపాల్‌లో.. సిక్కిం, టిబెట్ సరిహద్దుల్లో ఉంది. సిక్కింలోని మాంగన్‌కు పశ్చిమ వాయువ్య దిశలో 67 కిలోమీటర్ల దూరంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ ఎక్స్‌లో పోస్టు చేసింది. నేపాల్‌లో భూ ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ (ఎన్‌సీఎస్) ఎక్స్‌ ద్వారా వెల్లడించింది.భూకంపం ప్రభావంతో నేపాల్‌తోపాటు భారత్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లలోనూ భూమి కంపించింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్