Magazines

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వసతులు కరువు

16 నిమిషాల క్రితం

facilities
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

హాస్టళ్లలో మంచాల్లేవు... కళాశాలలకు దూరంగా హాస్టళ్లు

శీతాకాలంలోనూ చన్నీళ్లే దిక్కు
చదువుకే కాదు...
స్నానానికీ పోటీపడాల్సిందే

సౌకర్యాలు కల్పించాలంటున్న
ఎమ్‌‌బీబీఎస్‌ విద్యార్థులు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వైద్యవిద్యమీద ఆసక్తితో నీట్‌ ‌ద్వారా ఉత్తీర్ణులై ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో చేరిన విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే సాత్కారిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్న ప్రభుత్వం.. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి, భోజన, మరుగుదొడ్లు, తాగునీటి, వేడినీటి వంటి కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా బోధనాస్పత్రులు, హాస్టళ్లకు మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు విద్యార్థుల కు భారంగా మారాయి. ఆటో, మెస్‌, ఇతర్రతా ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు హాస్టళ్లలో, బోధనాస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్‌‌బీబీఎస్‌ ‌విద్యార్థులు వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఎమ్‌‌బీబీఎస్‌ ‌విద్యనభ్యసిస్తున్నారు. చాలా మెడికల్‌ ‌కాలేజీల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంకా రూమ్‌‌లు, బెడ్లను కూడా కేటాయించని పరిస్థితి.

మహేశ్వరంలో కాలేజీ.. 20 కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రి!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 2024లో ప్రారంభ మైన ప్రభుత్వ వైద్య కళాశాలకు రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ శాశ్వత క్యాంపస్‌, సొంత హాస్టల్‌ సదుపాయాలు అందుబా టులోకి రాలేదు. తాగునీరు, మరుగుదొడ్ల కొరతతోపాటు భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతు న్నాయి. జీవో 190 ద్వారా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలను ఎల్‌బీనగర్‌ టిమ్స్‌కు అనుసంధానించినప్పటికీ తరలింపు ప్రక్రియ పూర్తికాలేదు. తాత్కాలి కంగా చైతన్యపురిలోని భవనానికి కళాశాలను తరలించాలన్న ప్రతిపాదనకు విద్యార్థులు అంగీకరించినా కార్యరూపం దాల్చలేదు. దీంతో విద్యార్థులు ప్రయివేటు హాస్టళ్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇందుకోసం ఒక్కొక్కరు నెలకు రూ.7,500 నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు కళాశాలకు బోధనాస్పత్రి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రోజూ దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. ప్రత్యేక బస్సు సౌకర్యం లేకపోవడంతో రాకపోకలు భారంగా మారాయి. క్రీడా మైదానం లేకపోగా, లైబ్రరీ, ఇతర క్యాంపస్‌ సదుపాయాల వినియోగానికీ పరిమితులున్నాయి. ఈ సమస్యలను ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌, డీఎంఈ, కలెక్టర్‌, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థులు వాపోతున్నారు.

భద్రాద్రిలో నీటి కష్టాలు.. నెలకు రూ.6 వేల అదనపు భారం

భద్రాద్రి కొత్తగూడెంలో విద్యార్థులకు ఆస్పత్రికి దూరంగా హాస్టల్‌ కేటాయించారు. ఒక్కో గదిలో నలుగురు మెడికోలు ఉంటున్నారు. తీవ్ర నీటి కొరత కారణంగా కొన్నిసార్లు కనీసం ఫ్రెష్‌ కాకుండానే కళాశాలకు వెళ్లాల్సి వస్తున్నది. మెస్‌ బిల్లుల రూపంలో నెలకు రూ.4 వేలు చెల్లించడంతోపాటు ఆటో చార్జీలకు మరో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. హాస్టల్‌ వసతులు సరిగా లేకపోవడం, ఆస్పత్రికి దూరంగా ఉండటంతో ఒక్కో విద్యార్థిపై ప్రతినెలా రూ.6 వేల అదనపు ఆర్థిక భారం పడుతున్నది. నారాయణపేటలో హీటర్‌తో అగ్నిప్రమాదం జీఎంసీ నారాయణపేటలో వేడినీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్లను వినియోగించారు. ఇటీవల ఓ గదిలో హీటర్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో మెడికోల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ​

​ఎమ్‌‌బీబీఎస్‌ విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలి : మల్లోజు సత్య నారాయణ చారి, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ రాష్ట్ర అధ్యక్షులు

ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చేరేది ఎక్కువగా పేద విద్యార్థిలే. హాస్టళ్లలో మెస్‌ బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ, ట్యూషన్‌ ‌ఫీజులు కడుతున్నప్పటికీ నేటికీ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయం. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో హాస్టల్‌ ‌వసతిని కల్పించాలి. రవాణా, తాగునీరు, మరుగుదొడ్లు, వేడినీరు, భోజనం, భద్రత వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. బోధనాస్పత్రుల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పెండింగ్‌‌లో ఉన్న హాస్టళ్లను, మెడికల్‌ ‌కాలేజీలను వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నాం.


వంద మందికి ఒకే గీజర్‌.. అరగంట మాత్రమే!

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో వింత పరిస్థితి నెలకొంది. ఆ కళాశాల హాస్టల్‌‌లో 850 మంది ఎమ్‌‌బీబీఎస్‌ ‌విద్యార్థులు, 150 మంది మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ ‌చేసే వారున్నారు. కళాశాలకు, హాస్టల్‌కు మధ్య నాలుగు కిలోమీటర్ల దూరముంది. ద్వితీయ సంవత్సరం నుంచి ఫైనలియర్‌ వరకు విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. హాస్టల్‌లో ఒక్కో అంతస్తులో సుమారు వంద మంది విద్యార్థులుంటున్నారు. ఫ్లోర్‌‌కు ఒకే గీజర్‌ అందుబాటులో ఉంది. దాన్నీ 30 నిమిషాల పాటే ఉంచుతున్నారు. దీంతో వంద మంది విద్యార్థులు అరగంటలో వేడినీళ్లు ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‌అటవీ, చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న వికారాబాద్‌ మెడికల్‌ ‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్