Magazines

జంతర్‌ మంతర్‌లో మరో ‘రియా అహిర్‌’

50 నిమిషాల క్రితం

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీసు బస్సును అడ్డుకున్న యువతి
బస్సు ముందు చేతులు పెట్టి కదలకుండా నిల్చున్న వైనం
సోషల్‌ మీడియాలో 
వైరల్‌గా మారిన వీడియ
న్యూఢిల్లీ : చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసన జరిగింది. ఈ ఆందోళనలో వేలాది మంది పాల్గొన్నారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలిస్తుండగా.. ఓ యువతి ఒక్కసారిగా ఓ పోలీసు బస్సుకు ఎదురుగా నిలబడింది. బస్సు ముందుభాగంపై చేయి పెట్టి.. పక్కకు తప్పుకోవాలని పోలీసులు పదేపదే కోరినా ఆమె కదలకుండా అక్కడే నిల్చుంది. చుట్టూ ఉన్న ఇతర నిరసనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అయింది.‘

దాదాపు వెయ్యి మంది అదుపులోకి..
జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ పోలీసులు దాదాపు వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆప్‌ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్‌ భరద్వాజ్‌, మాజీ ముఖ్యమంత్రి అతిశీ కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్యే నిరసనకారులను తరలిస్తున్న పోలీసు బస్సుకు యువతి అడ్డుగా నిలిచిన ఘటన చోటుచేసుకుంది. వివాదస్పద సర్‌లో అవకతవకలు, పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబి తాల నుంచి సుమారు 13.3 కోట్ల పేర్లు తొలగిం చినట్టు కథనాలు వెలువడిన విషయం విదితమే.

రియా అహిర్‌’ను గుర్తుచేస్తూ..
ఈ యువతి చేసిన పనిని చూసిన పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముంబయికి చెందిన మోడల్‌, థియేటర్‌ నటి రియా అహిర్‌తో ఆమెను పోల్చారు. ‘ఢిల్లీలో మరో రియా అహిర్‌’ అంటూ పోస్టులు పెట్టారు. యువతి ధైర్యాన్ని పలువురు ప్రశంసించారు. కొత్త తరం యువత అన్యాయంగా భావించిన విషయాలపై వెనక్కి తగ్గడం లేదంటూ వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్