Magazines

గుజరాత్‌ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

56 నిమిషాల క్రితం

Gujarat's chemical industry
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

ఐదుగురు కార్మికులు మృతి మరో ఆరుగురికి గాయాలు

భరూచ్‌ : గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వాగ్రా ప్రాంతంలోని సాయ్‌ఖా జీఐడీసీ పారిశ్రామిక వాడలో ఉన్న సింజీల్‌ ఫార్మాకెమ్‌ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు అనంతరం మిథిలీన్‌ డైక్లోరైడ్‌ (ఎండీసీ) వాయువు లీకవడంతో పరిశ్రమతోపాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచులాంటి వాతావరణం ఏర్పడింది. 15 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్‌లో హైడ్రోజనేషన్‌ ప్రక్రియ జరుగుతుండగా పేలుడు సంభవించింది. దీని తీవ్రతకు రియాక్టర్‌ శకలాలు పరిశ్రమ బయటకు ఎగిరిపడ్డాయి. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్టు సమాచారం. భారీ యంత్రాల భాగాలు, లోహపు రేకులు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడ్డాయి. వాయువు ప్రభావంతో కార్మికులు కండ్ల మటలతో ఇబ్బందిపడగా, కొందరు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను భరూచ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను భరూచ్‌, వడోదరలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో చేర్చారు.నలుగురు మృతులను జైదీప్‌ పటేల్‌ (27), అనికేత్‌కుమార్‌ హరికిషోర్‌ (24), అర్జున్‌ రామ్‌సింగ్‌ గౌతమ్‌ (20), వృంద్‌ తలావియాగా గుర్తించారు. ఐదో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుజరాత్‌ కాలుష్య నియంత్రణ మండలి (జీపీసీబీ), పారిశ్రామిక భద్రత, ఆరోగ్య విభాగం (డీఐఎస్‌హెచ్‌) అధికారులు ప్రమాదానికి కారణాలు, భద్రతా నిబంధనల అమలుపై దర్యాప్తు ప్రారంభించారు. ఏడాదిలోపే కార్యకలాపాలు ప్రారంభించిన ఈ పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లపై విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్