Magazines

టోకు ధరల సెగ..

55 నిమిషాల క్రితం

wholesale prices..
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

11.39 శాతానికి ద్రవ్యోల్బణం
ఎగిసిపడుతున్న ఆహార రేట్లు
ముడి చమురు 57.32 శాతం భారం

న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదల రోజురోజుకు తీవ్రమవుతోంది. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు ఏకకాలంలో ఎగిసిపడటంతో సెప్టెంబరులో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 11.39 శాతానికి చేరింది. ఆగస్టులో నమోదయిన 9.92 శాతంతో పోలిస్తే ఒక్క నెలలోనే 1.47 శాతం పాయింట్లు పెరిగింది. 2022–23 ఆధార సంవత్సరంతో రూపొందించిన కొత్త సిరీస్‌లో ఇదే అత్యధిక స్థాయి. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ఠానికి చేరడం, ఇంధన ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు, సహజవాయువు ధరల పెరుగుదల ఏకంగా 57.32 శాతానికి చేరగా, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం కూడా 9.76 శాతానికి ఎగబాకింది. ధరల పెరుగుదల కొన్ని వస్తువులకే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలన్నింటికీ విస్తరిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఆగస్టులోని 22.93 శాతం నుంచి సెప్టెంబరులో 25.85 శాతానికి పెరిగింది. ఇందులో ముడి చమురు, సహజవాయువు ధరల పెరుగుదల 34.41 శాతం నుంచి 57.32 శాతానికి ఎగిసింది.

బొగ్గు, లిగ్నైట్ ధరల ద్రవ్యోల్బణం 1.57 శాతం నుంచి 9.31 శాతానికి చేరగా, ఖనిజ చమురు ఉత్పత్తుల ధరల పెరుగుదల 38.48 శాతం నుంచి 40.02 శాతానికి పెరిగింది. విద్యుత్ ధరలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 0.43 శాతం తగ్గాయి. కాగా.. ఆగస్టులో నమోదయిన 1.73 శాతం తగ్గుదలతో పోలిస్తే ధరల క్షీణత తగ్గింది. మే నుంచి ఆగస్టు వరకు కొంత తగ్గుముఖం పట్టిన (మొదటి పేజీ తరువాయి) ఇంధన ద్రవ్యోల్బణం సెప్టెంబరులో మళ్లీ వేగం పుంజుకోవడం గమనార్హం. ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆగస్టులో 5.67 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 8.14 శాతానికి చేరి 21 నెలల గరిష్ఠాన్ని తాకింది. రోజువారి ఉపయోగించే ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 7.76 శాతం నుంచి 8.67 శాతానికి పెరిగింది. కొత్త సిరీస్‌లో ఈ విభాగంలోనూ ఇదే అత్యధికం. ఖనిజాల ధరల పెరుగుదల 8.24 శాతం నుంచి 9.51 శాతానికి చేరింది. ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం మాత్రం 14.79 శాతం నుంచి 10.28 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఆహారం, ఖనిజాల ధరల పెరుగుదల కారణంగా ప్రాథమిక వస్తువుల మొత్తం ద్రవ్యోల్బణం అధికమైంది.


తయారీ ఉత్పత్తులు ప్రియం..
టోకు ధరల సూచీలో అత్యధికంగా 63.1 శాతం వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల విభాగంలోనూ ధరల ఒత్తిడి పెరిగింది. ఈ విభాగంలో ద్రవ్యోల్బణం ఆగస్టులోని 8.37 శాతం నుంచి సెప్టెంబరులో 9.76 శాతానికి చేరింది. కొత్త సిరీస్‌లో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణానికి ఇదే గరిష్ఠ స్థాయి. వస్త్రాలు, దుస్తులు, రసాయనాలు, ప్రాథమిక లోహాలు, విద్యుత్ పరికరాల ధరలు పెరిగాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్, ఆప్టికల్ ఉత్పత్తుల ధరలు గత కొన్ని నెలలుగా తగ్గుతుండగా, సెప్టెంబరులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 4 శాతానికి చేరింది. తయారీ రంగంలో ధరల పెరుగుదల కొనసాగితే ఉత్పత్తి వ్యయాలు మరింత అధికమై, వాటి ప్రభావం వినియోగదారుల ధరలపైనా పడే అవకాశం ఉంది. ఆహార పదార్థాలు, ఇంధన సంబంధిత రవాణా వ్యయాలు పెరగడంతో సెప్టెంబర్‌‌లో రిటైల్‌ ‌ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) రెండేండ్ల గరిష్టానికి చేరింది. ఆగస్టులో 4.83 శాతంగా నమోదైన సిపిఐ సెప్టెంబర్‌లో అమాంతంగా 5.54 శాతానికి పెరిగింది. 2024 అక్టోబర్‌లో నమోదైన 6.21 శాతం తరువాత ఇదే అత్యధిక స్థాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 6 శాతం పైనే ఉండొచ్చన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా నాలుగు నెలలుగా ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్