ఎనిమిది ప్రధానాంశాలపై ఆయా రాష్ర్టాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
రెండు నెలల్లో అమలు పురోగతిపై నివేదికలు సమర్పించాలని వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను మరింత పటిష్టం చేసేం దుకు నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళల భద్రతకు సంబంధించి ఎనిమిది ప్రధాన అంశాలపై చర్యలు తీసుకో వాలని మంగళవారం కేంద్రంలోని 10 మంత్రి త్వశాఖలు, రైల్వే బోర్డు చైర్మెన్, తెలంగాణ, ఏపీలతో పాటు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు ఆదేశాలు పంపింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా చేపట్టిన చర్యలపై (యాక్షన్ టెకెన్ రిపోర్ట్–ఏటీఆర్) నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని స్పష్టం చేసిం ది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ సర్వే (పీఎల్ఎఫ్పీఎస్), నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)ల తాజా నివేదిక లపై ఎన్‌హెచ్ఆర్‌సీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
మహిళల హక్కుల పరిరక్షణకు దేశంలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వారి భద్రత ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని అభిప్రాయపడింది. 2026 సెప్టెంబర్‌లో మహిళల కార్మిక శక్తి భాగస్వామ్యం 34.6 శాతంగా నమోదై నట్లు పీఎల్ఎఫ్పీఎస్ సర్వేను గుర్తు చేసింది. అలాగే ఎన్‌సీఆర్‌బీ–2026 తాజా రిపోర్ట్ లో మహిళ లపై నేరాలకు సంబంధించి సుమారు 4.4 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ గణాంకాలు మహిళల భద్రత కోసం నిరంతర, సమన్వయ పూర్వక చర్యలు అవసరమని స్పష్టం చేస్తున్నాయని నొక్కి చెప్పింది. మహిళ లకు రాజ్యాంగం కల్పించిన న్యాయం, సమాన అవకాశాల హక్కులను పరిరక్షించడంలో భద్రత కీలకమని కమిషన్ అభిప్రాయపడింది.
ఎనిమిది ప్రధానాంశాలపై ఫోకస్..
పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సమర్థవంతంగా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఎనిమిది అంశాలతో కూడిన గైడ్ లైన్స్ కు రూపకల్పన చేసింది. ఇందులో మహిళల భద్రత, లైంగిక వేధింపు లపై అవగాహన పెంపొందించడం, అవసర మైన మౌలిక సదు పాయాల కల్పన, వేధింపులు లేదా ప్రమాదకర పరిస్థితులను గమనిం చినప్పుడు ఇతరులు బాధితులకు సహాయం చేసేలా ప్రోత్సహించడం, పోలీసుల పాత్రను బలోపేతం చేయడం, బాధితులకు సహాయ సహకా రాలు అందించడం, మహిళలపై సైబర్ నేరాల నియంత్రణ, దీర్ఘకాలిక సంస్కరణలు, ఇతర అవసర చర్యలను ప్రస్తావించింది. ఈ సూచనళ/అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మహిళా, శిశు అభివృద్ధి, విద్య, హోం వ్యవహారాలు, సమాచార, ప్రసారాలు, కార్మిక, ఉపాధి, కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారులు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలతో పాటు రైల్వే బోర్డు పై ఉందని గుర్తు చేసింది. అలాగే దేశం లోని అన్ని రాష్ట్రాలు/యూటీలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.






కామెంట్‌లు (0)