Magazines

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : రాహుల్ గాంధీ

17 నిమిషాల క్రితం

My phone is being tapped: Rahul Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం సోషల్‌ ‌మీడియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్ తన ఫోన్‌ను పైకి ఎత్తి చూపిస్తూ, ట్యాపింగ్ జరిగినట్లు అందులో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని మోడీకి తెలుసునని అన్నారు. అలాగే, తనతో ముఖాముఖి చర్చకు రావాలని రాహుల్ ప్రధానికి సవాల్ విసిరారు. ఆ చర్చలో విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారో, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొన్నారో తెలుస్తుందని అన్నారు. నిజమైన దేశద్రోహి ఎవరో తేలాలంటే చర్చకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, తనతో చర్చకు వచ్చే ధైర్యం మోడీకి లేదని, ఆయన స్క్రిప్టు చూసి మాట్లాడతారని రాహుల్ విమర్శించారు. ఎక్కడైనా సరే, టెలిప్రాంప్టర్‌ను తీసుకువచ్చి డిబేట్‌లో పాల్గొనవచ్చని, వారికి నచ్చిన న్యాయమూర్తిని కూడా పెట్టుకోవచ్చని ఆయన సూచించారు. తనతో నేరుగా చర్చలో పాల్గొంటే ప్రధాని రాజకీయ జీవితం ముగిసిపోతుందన్నారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలను బిజెపి ఖండించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్