Magazines

ఆధార్‌‌కు బదులుగా ఓటర్‌ ఐడీ నిబంధన వద్దు

1 గంట క్రితం

No requirement for Voter ID in place of Aadhaar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

సంక్షేమానికి నిరుపేదలను దూరం చేయొద్దు : సీపీఐ(ఎం)

న్యూఢిల్లీ : సంక్షేమ పథకాల చెల్లింపులకు ప్రాతిపదికగా ఆధార్‌‌కు బదులుగా బయోమెట్రిక్స్‌‌ను, ఓటర్‌ ఐడీ (ఎపిక్‌)‌ను తీసుకు వస్తామంటూ పంచాయితీరాజ్‌ ‌శాఖ మంత్రి రాజీవ్‌ ‌రంజన్‌ ‌సింగ్‌ ‌చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రకటనను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. గ్రామీణ పేదలపై ఇది మరో దాడి అని వ్యాఖ్యానిం చింది. ఈ మేరకు పొలిట్‌‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ ఉపాధి చట్టాల్లో వ్యవసాయ కార్మికులకు బయో మెట్రిక్‌ను ప్రామాణీకరించడం ఏ విధంగా ప్రవేశాన్ని నిరాకరించిందో ఇప్పటికే పదే పదే రుజవైంది. చాలామంది వృద్ధులైన మహిళా కార్మికులకు వారి కనురెప్పల (ఐరిస్‌)‌ను యంత్రాలు గుర్తించడంలో విఫలం కావడంతో వారికి అందాల్సిన ప్రయోజనాలు అందలేదు. అలాగే శారీరక శ్రమచేసే కూలీలకు కూడా వారి అరిగిపోయిన వేలిముద్రలను బయో మెట్రిక్‌ ‌వ్యవస్థ సరిగా పోల్చకపోవడంతో వారిని కూడా మినహాయిస్తున్నారు. ఈ-కెవైసీకి స్మార్ట్‌ ‌ఫోన్లు అవసరమవుతున్నాయి. చాలామంది గ్రామీణ కుటుంబాలకు అటువంటి ఫోన్లు ఉండవని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది.

ఆధార్‌‌ను తప్పనిసరి చేయబోమని గతంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ సంక్షేమ పథకాలన్నింటిలోనూ దాన్ని రహస్యంగా విధించే ప్రయత్నం జరుగు తోంది. కానీ, లోపరహితమైన దిగా గొప్పగా చెప్పుకున్న ఆధార్‌‌ని ఇప్పుడు ప్రభుత్వమే పక్కనబెడు తోందని సీపీఐ(ఎం) విమర్శించింది.

ఓటింగ్‌ ‌హక్కులపై సర్జికల్‌ ‌దాడిగా, మూకుమ్మడిగా ఓటు హక్కులను తొలగించేం దుకు ఒక పద్ధతి ప్రకారం సాగే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియతో పాటే దీన్ని కూడా చూడాల్సి వుంది. ఇప్పటికే 13.4కోట్ల మందికి పైగా ఓటర్లను తొలగించారు. వీరిలో వెనుకబడిన కమ్యూనిటీలు, ముస్లింలు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు ప్రధానంగా ప్రభావితులయ్యారని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది.

ఇప్పుడు, సంక్షేమ పథకాలకు ఓటర్‌ ఐ‌డీ కావాలనడం వల్ల పేదలకు మరింతగా దూరమ వుతాయి. ఇప్పటికే, సర్‌ ‌ద్వారా పేర్లు తొలగించ బడ్డాయనే సాకుతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌, ఇతర ప్రయోజనాలను నిరాకరి స్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన అది సామా జిక సంక్షేమ అర్హతలను ప్రభావితం చేయరాదన్న సుప్రీం కోర్టు రూలింగ్‌‌ను ఇది స్పష్టంగా ఉల్లంఘించడమేనని ‌సీపీఐ(ఎం) పేర్కొంది.

ఈ ఎత్తుగడలన్నీ కూడా మెజారిటీ ప్రజలకు ప్రయోజనాలు అందకుండా నిరాకరించేం దుకు కట్టుదిట్టంగా జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నా యని పొలిట్‌‌బ్యూరో విమర్శించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ ‌చేసింది. గ్రామీణ నిరుపేదలకు అందుబాటులో లేని సాంకేతికత లేదా పత్రాలు కావాలని షరతులు విధించకుండా సంక్షేమ హక్కు లను సార్వజనీనంగా అందజేయాలని కోరింది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్