Magazines

కర్నాటకలో కొనసాగుతున్న 
ఆశా వర్కర్ల నిరసన

1 గంట క్రితం

Protest by ASHA workers continues in Karnataka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్నాటకలో ఆశా (అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్తల నిరసన కొనసాగుతోంది. ఈ నెల 17 నుంచి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఆశాలు నిరవధిక నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. తమ నెలవారీ గౌరవ వేతనాన్ని రూ. 8 వేల నుంచి రూ. 15వేలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని, పదవీ విరమణ ప్రయోజనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలని, మెరుగైన పని పరిస్థితులను కల్పించాలని ఆశాలు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది జనవరిలో అప్పటి కర్నా టక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ, మే నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోకేవలం రూ. 1,000 మాత్రమే పెంచారు. దీన్ని ఆశాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పాల ధర లీటరకు రూ. 8 పెరిగితే, తమ గౌరవ వేతనం కేవలం వెయ్యి మాత్రమే పెంచారని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “అధికారంలో ఉన్న నాయకులు వేలాది రూపాయిల ఖర్చుతో జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు చేస్తుంటారు, కానీ మా లాంటి పేద మహిళల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదు. గత ఏడు రోజులుగా మేము నేల మీద పడుకుంటున్నాము. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుండి కదిలేది లేదు” అని మమత అనే ఆశా స్పష్టం చేశారు. బెంగళూరుకు చెందిన శారద మాట్లాడుతూ, తన ఇద్దరు పిల్లలకు దూరంగా ఉండి ఈ నిరసనలో పాల్గొంటున్నానని చెప్పారు. ఆమె తన నాలుగేళ్ల చిన్న బిడ్డను, మరో బిడ్డను ఇంట్లో వృద్ధురాలైన అత్తగారి దగ్గర వదిలి వచ్చానని తెలిపారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తల వద్ద నుంచి వైద్యుల స్థాయి పనిని ఆశిస్తోందని, కానీ కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్