మృతుల్లో భారతీయులు
రాస్ అల్ ఖైమా : యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాస్ అల్ ఖైమాలో బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తెలిపింది. అయితే.. ఏయే రాష్ట్రాలకు చెందిన వారనే విషయాలు ఇంకా తెలియరాలేదు.స్థానిక మీడియా ప్రకారం.. సాంకేతిక లోపంతో రోడ్డు మీద ఆగిన ట్రక్కును బస్సు ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత కాన్సుల్ కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలను సంప్రదించామని, వారికి సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు హెల్ప్‌లైన్ నంబర్ 971 800-46342లో అందుబాటులో ఉంటామని తెలిపింది.
హూతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ సెంటర్‌లో ఒక ఎత్తైన భవనంపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 11 మంది గాయపడ్డారని సౌదీ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరు సౌదీ పౌరులు, ముగ్గురు నేపాలీ జాతీయులు, నలుగురు ఈజిప్షియన్లు కూడా ఉన్నట్లు ధ్రువీకరించారు. అయితే.. గాయపడిన భారతీయుల వివరాలు, వారికి అయిన గాయాల తీవ్రతను గురించి అధికారులు వెల్లడించలేదు.







కామెంట్‌లు (0)