Magazines

ముగ్గురిని మింగిన సెప్టిక్‌ ట్యాంక్‌

9 నిమిషాల క్రితం

Septic tank
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

శుభ్రం చేసేందుకు లోపలికి దిగి కార్మికులు మృతి.. బాచుపల్లిలో తీవ్ర విషాదం

నవతెలంగాణ – నిజాంపేట్‌ ​
పొట్టకూటి కోసం పనికి వెళ్లిన ముగ్గురు కార్మికులు సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఊపిరాడక ప్రాణం కోల్పోయారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ట్యాంక్‌ లోతు, లోపల పరిస్థితులను అంచనా వేయలేక వారు ప్రమాదవశాత్తు మృతిచెందినట్టు తెలుస్తోంది. బాచుపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాకువరం గ్రామానికి చెందిన సుమన్‌(22), సురేష్‌(25), కొత్తూరు మండలం మాకువరం గ్రామానికి చెందిన పవన్‌(25) హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఆర్‌ ఇన్వెస్టివ్స్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ సంస్థలో పని చేసేవారు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.20 గంటల సమయంలో బాచుపల్లిలోని దినేష్‌ ఔరిక్‌ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు లోపలికి దిగారు. ట్యాంక్‌ లోతును అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ అందులో మునిగిపోయి ఊపిరాడక ప్రాణం కోల్పోయారు. సమాచారం అందుకున్న బాచుపల్లి సీఐ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్