రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం ఇటీవల విడుదలై రికార్డు స్థాయిలో కాపీలు అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యం లో సోనియా గాంధీ తన పిల్లలు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మధ్య ఆత్మీయ సంభాషణకు సంబంధిం చిన వీడియోను వారు మంగళవారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సంభాషణలో భాగంగా రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగంతో మాట్లా డారు. రాజకీయాల్లో తన తల్లి ఎదు ర్కొన్న అవమానాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ 1977 ఎమర్జెన్సీ అనంతర పరిస్థితులను గుర్తు చేసు కున్నారు. గౌరవప్రదమైన వ్యక్తులు గా చెప్పుకునేవారు కూడా కొందరు ఒక మహిళ పట్ల అంత నీచంగా ప్రవర్తించడం చూసి కుమారుడిగా తీవ్ర అసహ్యం వేసిందన్నారు.






కామెంట్‌లు (0)