Thursday, January 8, 2026
E-PAPER
Homeబీజినెస్అమేజాన్ - ఫ్లిప్ కార్ట్ లలో జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ అమ్మకాలు

అమేజాన్ – ఫ్లిప్ కార్ట్ లలో జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ అమ్మకాలు

- Advertisement -

నవతెలంగాణ ముంబయి: జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ఈ ఏడాది తమ సాహసోపేతమైన కొత్త ఆవిష్కరణలు 2025 యెజ్డీ అడ్వంచర్, 2025 యెజ్డీ రోడ్ స్టర్ లను అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందచేస్తోంది. ఇప్పటి వరకు కేవలం షోరూంలలో మాత్రమే లభించాయి. గత ఏడాదితో పోల్చినప్పుడు రికార్డ్ స్థాయిలో పండగ అమ్మకాలు నమోదయ్యాయి. యెజ్డీ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన మోటార్ సైకిల్స్ భారతదేశంలో అతి పెద్ద ఇ-కామర్స్ ప్లాట్ ఫాంలలో ఇప్పుడు కేవలం ఒక క్లిక్ తో లభిస్తాయి. అత్యధిక పండగ డిమాండ్ సందర్భంగా యెజ్డీ శ్రేణికి సరికొత్త చేరికలు కీలకమైన మార్కెట్లలో మరింత అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇది క్లాసిక్ మోటార్ సైక్లింగ్ లను అభిమానించి, వాటిని రైడ్ చేసే అభిరుచి గల రైడర్స్ తో బ్రాండ్ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించింది.

ఆన్ లైన్ లో అన్నీ కొత్త మోడల్స్ తో, గత ఏడాది ఆన్ లైన్ లో శక్తివంతంగా కంపెనీ తమ డిజిటల్ పంపిణీ చేరికను ప్రోత్సహించడానికి పెట్టుబడిని ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్ లో ప్రీమియం క్లాసిక్ మోటార్ సైకిల్స్ జాబితా చేసిన మొదటి బ్రాండ్ గా నిలిచింది. తదుపరి స్థానంలో అమేజాన్ ఉంది. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ఆన్ లైన్ రిటైల్, అనేది ఈ ఏడాది దాని ప్రధాన మార్కెట్లలో స్థిరంగా విస్తరించబడిన బ్రాండ్ యొక్క పంపిణీ నెట్ వర్క్ పై ఆధారపడింది. రైడర్స్ ఇప్పుడు రోజూవారీ బ్రౌజింగ్ చేసేంత సులభంగా వాహనాలను కనుగొనడం నుండి బుక్కింగ్ చేయడం వరకు అన్నింటినీ పూర్తి చేసి, నిజమైన రహదారులు, పనితీరు కోసం రూపొందించబడిన వాహనాలను ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

అనుపమ్ థరేజా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహస్థాపకులు మాట్లాడుతూ “అమేజాన్ – ఫ్లిప్ కార్ట్ పై రెండు అత్యంత అభిమానించబడే యెజ్డీలను తీసుకురావడం వలన భారతదేశంవ్యాప్తంగా ఉన్న రైడర్స్ క్లాసిక్ మోటార్ సైక్లింగ్ యొక్క ఉల్లాసం అనుభవించడం సులభం చేస్తుంది. 2025 అడ్వంచర్ మరియు రోడ్ స్టర్ లు మా షోరూంలలో అనూహ్యమైన ప్రతిస్పందనను తెచ్చాయి. ఇది సంప్రదాయం మరియు ఆధునిక ఇంజనీరింగ్ ను అధిగమించగల సామర్థ్యపు క్లాసిక్స్ పట్ల రైడింగ్ కమ్యూనిటీకి ఉన్న అభిమానాన్ని ప్రోత్సాహాన్ని సవినయంగా గుర్తు చేస్తుంది. ఆన్ లైన్ రిటైల్ తో, మేము శ్రమను సరళం చేస్తున్నాం, కాబట్టి మా డీలర్ షిప్స్ అత్యంత సౌకర్యవంతమైన విధానంలో తమ వాహనాలతో రైడర్ ను కలుపుతున్నాయి. ” అని అన్నారు.

ఏ విధంగా ఆన్ లైన్ కొనుగోలు పని చేస్తుంది :

1. అమేజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ పై ఎక్స్షోరూం బుక్కింగ్ మొత్తం చెల్లించండి.

2. అథీకృత స్థానిక డీలర్ ఆర్డర్ ను నిర్థారిస్తారు మరియు తక్కిన ఆన్రోడ్ చెల్లింపు కోసం కస్టమర్ కు మార్గదర్శకత్వంవహిస్తారు.

3.డీలర్ షిప్ లో రిజిస్ట్రేషన్ మరియు బీమాలు పూర్తవుతాయి, తదుపరి అంతిమంగా అప్పగించబడుతుంది. యాక్ససరీస్ మరియు ఆడ్-ఆన్స్ డీలర్ షిప్ వద్దే కొనుగోలు చేయాలి.

ఈ కింది వంటి ప్లాట్ ఫాంనిర్దిష్టమైన ఆఫర్లను కూడా రైడర్స్ పొందవచ్చు :

· అమేజాన్ పై, రూ. 6,500 వరకు క్రెడిట్ కార్డ్ క్యాష్ బాక్, అమేజాన్ పే ICICI సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ పై అమేజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం 5% క్యాష్ బాక్ మరియు 6 నెలల వరకు నో కాస్ట్ EMIని పొందవచ్చు.

· ఫ్లిప్ కార్ట్ పై, రూ. 10,000 వరకు బ్యాంక్ ఆఫర్, రూ. 4,000 వరకు క్రెడిట్ కార్డ్ క్యాష్ బాక్ ఆఫర్ ను పొందండి.

ఆన్ లైన్ లో లభించే మోడాల్స్ :

2025 యెజ్డీ అడ్వంచర్ మరియు 2025 రోడ్ సటర్ సహా యెజ్డీ శ్రేణి మరియు పూర్తి జావా పోర్ట్ ఫోలియో ( 350, 42, 42 FJ, 42 Bobber, and Perak),ఇప్పుడు రెండు ప్లాట్ ఫాంలలో జాబితాలో ఉన్నాయి.

సర్వీస్ లైవ్ లో ఉంది :

బ్రాండ్ ఇ-కామర్స్ నెట్ వర్క్ ప్రస్తుతం 55 మంది డీలర్స్ తో 44 నగరాల్లో పని చేస్తోంది.

దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో బెంగళూరు, బెళగవి, మరియు గుల్బర్గా (కాలాబురగి); తమిళనాడులో మధురై; తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబనగర్, కరీంనగర్ మరియు నిజామాబాద్; ఆంధ్రప్రదేశ్ లో జేపోర్ మరియు విశాఖపట్టణం.

ఉత్తర భారతదేశంలో, న్యూఢిల్లీ మాత్రమే కాకుండా, రాజస్థాన్ లో జైపూర్, జోధ్ పూర్, సికర్, బికనీర్, ఉదయ్ పూర్ ;ఉత్తర్ ప్రదేశ్ లో సహరాన్ పూర్, షామ్లి, అజమ్ ఘర్, ఆలీఘర్, మధుర, కాన్పూర్, ఝాన్సీ, బల్లియా ;హర్యాణాలో అంబాలా మరియు రేవరి; పంజాబ్ లో భటిండా; జమ్ము & కాశ్మీర్ లో శ్రీనగర్ ; ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో.

తూర్పు భారతదేశంలో, పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్ మరియు మాల్దా; ఒడిశ్సాలో అంగుల్, బలుగావ్ మరియు భువనేశ్వర్ ; ఛత్తీస్ ఘర్ లో రాయ్ పూర్ ; జార్ఖండ్ లో జంషెడ్ పూర్ ; బీహార్ లో సమస్తీపూర్; మణిపూర్ లో ఇంఫాల్ లు.

పశ్చిమ భారతదేశంలో, మహారాష్ట్రలో పూణె, మరియు గుజరాత్ లో రాజ్ కోట, జామ్ నగర్ లలో.

జావా యెజ్డీ యాజమాని హామీ కార్యక్రమం :

· అన్ని జావా మరియు యెజ్డీ మోటార్ సైకిళ్లకు సమగ్రమైన ‘ జావా యెజ్డీ BSA ఓనర్ షిప్ అష్యూరెన్స్ ప్రోగ్రాం (యజమాని హామీ కార్యక్రమం) ‘ మద్దతు లభిస్తోంది- ఈ శ్రేణిలో పరిశ్రమలోనే మొదటి కార్యక్రమం.

·4- సంవత్సరాలు /50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ: మా ఇంజనీరింగ్ శ్రేష్టతను ప్రదర్శించే శ్రేణిలో ప్రముఖ రక్షణను కార్యక్రమం అందిస్తోంది, తమ మోటార్ సైకిళ్లు శాశ్వతంగా ఉండేలా నిర్మించారని మనశ్సాంతిని రైడర్లకు ఇస్తుంది.

· ఆరు సంవత్సరాల వరకు ఎక్స్ టెండెడ్ వారంటీ ఆప్షన్స్ : బైక్ రోడ్డు కోసం సిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసంతో చెప్పే ప్రీమియం కవరేజ్ మరియు ఊహించని మరమ్మతు ఖర్చుల ఒత్తిడ్ని పరిష్కరిస్తుంది.

· రెండేళ్ల ఏ సమయంలోనైనా వారంటీ ( యజమానిగా మారిన నాటి నుండి ఆరు సంవత్సరాలు లోగా) :  స్టాండర్డ్ వారంటీ ముగిసిన తరువాత కూడా అవసరమైనప్పుడు చేర్చదగిన సరళమైన పరిష్కారం. కస్టమర్లు ఎన్నడూ కవరేజ్ లేని పరిస్థితి లేకుండ

· ఒక ఏడాది అభినందనపూరకమైన రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA): ఎనిమిదేళ్ల వరకు పొడిగించదగినది ; వారికి అవసరమైనప్పుడు రైడర్స్ సహాయం పొందడాన్ని నిర్థారిస్తుంది మరియు దూర ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు లేకుండా హామీ వహిస్తుంది.

· అయిదేళ్ల సమగ్రమైన AMC ప్యాకేజీ : ఊహించదగిన ఖర్చులతో ఇబ్బందిరహితమైన సర్వీసింగ్, సజావైన యజమాని అనుభవం కోసం ఊహించని ఖర్చులను నిర్మూలిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -