Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంట్రాన్స్‌జెండర్ల బిల్లును వ్యతిరేకించిన జయా బచ్చన్‌

ట్రాన్స్‌జెండర్ల బిల్లును వ్యతిరేకించిన జయా బచ్చన్‌

- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల సవరణ బిల్లు-2026 ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును సమాజ్‌వాది పార్టీ ఎంపి జయా బచ్చన్‌ వ్యతిరేకించారు. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. అధికారపక్ష ఎంపీలు అడ్డుకోగా.. ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లుపై ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అశాస్త్రీయంగా ఉంది. ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని జయా మండిపడ్డారు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి మెడికల్‌ బోర్డు సర్టిఫికేట్‌ పొందాలనే నిబంధనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలు నిజంగా తీరాలంటే వారి వర్గం నుంచే ఒకరిని పార్లమెంట్‌కు నామినేట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -