నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
సెప్టెంబర్ 25 – 26 వ తేదీ లలో సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలనీ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. నిజామాబాద్ PYL జిల్లా అధ్యక్షడు వనమాల సత్యం మాట్లాడుతూ .. దేశం లో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య లు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకువడం లేదని అన్నారు. నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశం కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థ లని ప్రయివేట్ పరం చేస్తూ.. రిజర్వేషన్ లేకుండా చేస్తుందని అన్నారు. ఒక సంవత్సరo లోనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఎందుకు ఇవ్వలేదో యువత కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
10 సంవత్సరాలుగా GST పేరుతో ప్రజల సంపదను పన్నుల పేరుతో దోచుకొని జీఎస్టీ తగ్గించి సంబరాలు చేస్తున్నాడని అన్నారు. కానీ దేశంలో ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయని, ధనవంతుల ఆదాయలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అదే సమయంలో పేదవాడి ఆదాయం ఎందుకు పెరగలేదో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. దేశం లో మైనారిటీ, దళిత, గిరిజన ప్రజలపైన దాడులు జరుగుతున్నాయని, మణిపూర్ లో మానవ హననం జరిగిన మోడీ ఎందుకు మౌనం ఎందుకు వహించాడో దేశా ప్రజలు అర్ధం చేసుకోవలని అన్నారు.
రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్ధాలకి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుందని అన్నారు. డ్రగ్స్ ని నివారించాలని ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. ఈ నెల 25- 26 నా సూర్యాపేట జిల్లా కోదాడ లో ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ను జయప్రదం చేయాలనీ యువత ని కోరారు. ఈ కార్యక్రమం పివైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండమీది నరసయ్య, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు వాసరి సాయినాథ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
25, 26 న పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES