Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన జయశంకర్‌

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన జయశంకర్‌

- Advertisement -

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవితాన్ని గడిపిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి (ఆగష్టు-6) సందర్భంగా మంగళవారం ఆయన కృషిని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర సాధనకు ఆయన చేసిన నిర్విరామ కృషిని, సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. జయశంకర్‌ సార్‌ స్వరాష్ట్ర కలల జెండాను.. భవిష్యత్‌ అజెండాను ఎన్నడూ వదలిపెట్టలేదని పేర్కొన్నారు. తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారనీ, కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారని తెలిపారు. తన జీవితం తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏవిధంగా నష్టపోయారో గణాంకాలతో సహ ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్ధాలు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్‌ జయశంకర్‌కే దక్కుతుందని తెలిపారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామనీ, ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -