Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లిలో జయశంకర్ బడిబాట, గ్రామసభ

చౌట్ పల్లిలో జయశంకర్ బడిబాట, గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటలో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యార్హతలు కలిగి విద్యార్థులలో దాగివున్న నైపుణ్యలను వెలికి తెస్తూ, విలువలు కలిగిన విద్యను ఉపాధ్యాయులు అందిస్తారన్నారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణను పెంచుతూ విద్య నేర్పిస్తారు అన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండని తల్లిదండ్రులను కోరారు.  కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాళ్లు కమల, రమా, వాణి, భాగ్య, మధురిమా, ఐకేపీ సీసీ పీరియ, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బంతిలాల్, ఏ. శ్రీనివాస్, రాజు, ఫిజికల్ డైరెక్టర్ నగేష్, ప్రవళిక, వర్ష,  మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు అశోక్, మారుతి, గంగకిషన్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad