Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జయశంకర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకోవాలి 

జయశంకర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను భావితరాలు స్పూర్తిగా తీసుకోవాలని బొమ్మకల్లు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలా శోభారాణి అన్నారు. జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప వ్యక్తి జయశంకర్‌ అని కొనియాడారు. ఆయన బతికి ఉన్న సమయంలో స్వరాష్ట్రం ఏర్పడక పోవడం దురదృష్టకరమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం వారు చేసిన కృషి, తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం ఆయన పడిన తపన గురించి విద్యార్థులకు హెచ్ఎం వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. సురేష్, జి. రమేష్ బాబు, యం. భాస్కర్, బి. ఎల్లగౌడ్, ముడుంబై ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -