నవతెలంగాణ – జన్నారం
స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత కొత్తపల్లి ఆచార్య జయశంకర్ అని మాజీ ఎంపీపీ మత్స్య శంకరయ్య, టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సిటిమల భరత్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, జన్నారంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిటీమల భరత్ కుమార్ వేరువేరుగా జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ గోపీచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ ఉపాధ్యక్షులు వాసాల భాస్కర్, చిందం లచ్చన్న రాజు రామచంద్రం భాగ్య శైలజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన కృషి ఎనలేనిది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES