Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టియూఎఫ్ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి

టియూఎఫ్ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణ సిద్దాంత కర్త ప్రొపెసర్ జయశంకర్ సార్ వర్థంతి వేడుకలు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం (టియుఏప్)ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ నిరంతరం కృషి చేసి రాష్ట్ర ఆకాంక్షను రగిలించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహనీయడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టియూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్, నాయకులు కోంఢ్ర సారయ్య, మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, తొకల గట్టయ్య  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -