-మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన సిద్ధాంతకర్త జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితమని మాజీ ఎమ్మల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా బతికిన మహనీయుడు జయశంకర్ సర్ అని కొనియాడారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది అని నమ్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులాన్నారు. తెలంగాణ సమాజాన్ని ఉద్యమ బాటలో నడిపిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ బాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES