సంపన్న టెకీ ఎగ్జిక్యూటివ్‌లో టాప్
న్యూఢిల్లీ : టెకీ సంపన్న ఎగ్జిక్యూటివ్‌లలో సత్యా నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి జయశ్రీ ఉల్లాల్ వచ్చారు. గత కొన్ని ఏండ్లుగా సత్యా నాదేళ్ల, పిచాయ్ ఇద్దరూ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్‌లుగా కొనసాగుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఆ స్థానాన్ని వారు కోల్పోయారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 టెకీ ఎగ్జిక్యూ టివ్‌ల్లో ఆ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలోకి వచ్చారు. జయశ్రీ ఉల్లాల్ రూ.50,170 కోట్ల నికర విలువతో టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల రూ.9,770 కోట్ల నికర విలువతో రెండోస్థా నంలో నిలవగా.. రూ. 5,810 కోట్లతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏడో స్థానంలో ఉన్నారు. జయశ్రీ 1961లో లండన్‌లో జన్మించి.. ఐదేండ్ల వయసులో భారత్‌కు వచ్చారు. సాధార ణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల సీఈఓల జీతాలు, స్టాక్ ఆప్షన్ల ద్వారా సంపదను పొందు తారు. అయితే జయశ్రీ ఉల్లాల్ ఒక సంస్థను ఏర్పాటు చేసి అగ్రస్థాయికి తీసుకెళ్ల డంలో కీలక పాత్ర పోషించి, ఆ సంస్థలో భారీ వాటాను కలిగి ఉండటం వల్ల ఆమె సంపద అమాంతం పెరిగింది.
సత్యా నాదెళ్ల, పిచాయ్‌ను వెనక్కి నెట్టిన జయశ్రీ
- Advertisement -
- Advertisement -



