Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం లేదని జేసీకి వినతి

కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం లేదని జేసీకి వినతి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్ ని కలిసి రాష్ట్ర బేడ, బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరుపాటి వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుశురాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గిర్ని వెంకటి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాష శివ ల ఆధ్వర్యంలో బేడ బుడగ జంగాల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకై జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి బుడగ జంగాల ధ్రువీకరణ పత్రాలకై చర్చించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం  లేరని, కేవలం బుడగజంగాలు మాత్రమే ఉన్నారని, రాష్ట్ర గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ లు బుడగ జంగాల నాయకులతో కలిసి  జెసి కి వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, జేఏసీ వైస్ చైర్మన్ తూర్పాటి యాదయ్య, గగనం ముంతప్ప, డీజే హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గగనం శేఖర్, డీజే హెచ్ పి  అధ్యక్షులు సిరువాటి శ్రీనివాస్, బి జె హెచ్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు తూర్పాటి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పాటి చిన్న కోటయ్య,  జిల్లా అధ్యక్షులు కొండపల్లి సాయిలు, ముఖ్య సలహాదారులు కళ్లెంలక్ష్మీపతి, కళ్లెo రవి, అల్లం పండరి, అల్లం శ్రీను, వివిధ గ్రామాల సంఘ పెద్దలు,  సంఘస్తులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad