Monday, May 12, 2025
Homeజాతీయంజేఈఈ(అడ్వాన్స్‌డ్) అడ్మిట్ కార్డులు విడుదల

జేఈఈ(అడ్వాన్స్‌డ్) అడ్మిట్ కార్డులు విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జేఈఈ(అడ్వాన్స్‌డ్) – 2025 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుల కోసం అధికారిక సైట్‌ (https://cportal.jeeadv.ac.in/) ద్వారా పొందవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి మూడు గంటల నిడివి ఉంటుంది. రెండు పేపర్లలో హాజరు కావడం తప్పనిసరి. పరీక్ష మే 18, 2025న జరగనుంది. మొదటి పేపర్ ఉదయం 9 నుండి 12 వరకు జరుగుతుంది. రెండవ పేపర్ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు జరుగుతుంది. కనీసం 40% వైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రతి పేపర్‌కు ఒక గంట సమయం అదనంగా ఇస్తున్నారు. ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్టంగా రెండుసార్లు జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్ష రాయవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -