Thursday, January 8, 2026
E-PAPER
Homeబీజినెస్ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌ సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌ సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌

- Advertisement -

ముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) కొత్తగా జీవన్‌ ఉత్సవ్‌ పేరిట సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ను విడుదల చేసింది. ముంబయిలో మంగళవారం దీనిని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. జనవరి 12 నుంచి దీని విక్రయాలు ప్రారంభం అవుతాయని ఎల్‌ఐసీ తెలిపింది. నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌లింక్డ్‌, వ్యక్తిగత, సేవింగ్స్‌, పూర్తి జీవితకాలానికి బీమా అందించే ప్లాన్‌ ఇది. ఒకసారి పాలసీని కొనుగోలు చేస్తే జీవితాంతం ఆదాయం పొందేలా ఈ పాలసీని రూపొందించింది. నెల నుంచి 65 ఏండ్ల లోపు వారు ఈ పాలసీని కొనుగోలు చేయడానికి వీలుంది. కనీస ప్రీమియంను రూ.5 లక్షలుగా నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -