హాస్యనటుడు సత్య, దర్శకుడు రితేష్ రానా కలయికలో రాబోతున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమ లత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగులో పరిచయం కానుంది. తాజాగా మేకర్స్ చిత్ర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ,’ఇందులో స్పెషల్ హీరోలా అంటూ ఏమీ ఉండదు. యాక్షన్‌లో కూడా కామెడీని ఫీల్ అవుతారు.
‘మత్తువదలరా’ సక్సెస్ తరువాత నాకు అవకాశాలు చాలా పెరిగాయి’ అని తెలిపారు. ‘ఆద్యంతం వినోదభరితంగా ఉండే చిత్రమిది. సత్య అభిమానులందరికీ ఒక మాట చెబుతున్నాను. మీకు మార్నింగ్ హెవీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మార్నింగ్ షోకి రాకండి.. ఎందుకంటే మేం మార్నింగ్ షోనే ఫుల్‌మీల్స్ పెడతాం’ అని దర్శకుడు రితేష్ రానా చెప్పారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ,’ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. సమ్మర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. ఇది అవుల్ ఆఫ్ ది బాక్స్ మూవీ. యూనిక్ కాన్సెప్ట్. సినిమా అంతా ఫ్లైయిట్‌లో షూట్ చేశాం. సినిమా చాలా ఎగ్సైటింగ్‌గా ఉంటుంది. ఈసినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘జెట్లీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



