Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహీస్‌

జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహీస్‌

- Advertisement -

ది గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ పుస్తకావిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహీస్‌-ది గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ ” పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో అసఫ్‌ జాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్‌ కేంద్రంగా పాలనను చేసిన సుబేదారుల వివరాలు, వారి చరిత్రతో కూడిన ఈ కాఫి టేబుల్‌ బుక్‌ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే కన్నెగంటి వెంకటరమణ చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్‌ బుక్‌ ను వెలువరించడం అభినందనీయమని సీఎస్‌ ప్రశంసించారు.

వరంగల్‌ అంటే… కాకతీయుల పాలన, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్‌, భద్రకాళి ఆలయం వెంటనే మదికి వస్తాయి. అయితే, వరంగల్‌ నగరంలో అడుగు పెట్టగానే కాజిపేట నుంచి మామునూర్‌ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుతమైన భవనాలు, కాజిపేట రైల్వే స్టేషన్‌, ప్రస్తుత మిషన్‌ భగీరథ పధకమైన ఇంటింటికి తాగునీరందించే ధర్మసాగర్‌ ఫిల్టర్‌ బెడ్‌ ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు వరంగల్‌ కేంద్రంగా వరంగల్‌ సుబాV్‌ాగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. ఈ వరంగల్‌ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతో కూడిన సమాచారంతో పాటు నిజాం నిర్మిత హెరిటేజ్‌ కట్టడాల ఫోటోలతో కలిపి ఈ కాఫి టేబుల్‌ బుక్‌ ఉంటుంది. ఈ పుస్తకం చరిత్ర అధ్యయన వేత్తలు, విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హెచ్‌.ప్రియాంక హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -