Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన రాపాక సోమేశ్వర్ శోభ దంపతుల కుమార్తె సంయుక్త, విక్రమ్ ల వివాహ వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలో గల బృందావన్ గార్డెన్ లో నిర్వహించడంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావులతో పాటు కాంగ్రెస్ పార్టీ  నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

పలు వివహమహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి
పాలకుర్తి పట్టణంలోని బృందావనం గార్డెన్లో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ అన్న కూతురు వివాహ మహోత్సవంలో టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ గారి అన్న కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు, రెండు కుటుంబాలకు ఆనందభరితమైన దాంపత్య జీవితం, సుఖసమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. ఝాన్సి రెడ్డి వెంట పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -