Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విశ్రాంతి గదుల నిర్మాణానికి ఝాన్సీ రెడ్డి దంపతుల భూమి పూజ 

విశ్రాంతి గదుల నిర్మాణానికి ఝాన్సీ రెడ్డి దంపతుల భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
2023 జూలైలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన  టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయానికి 20 లక్షలతో విశ్రాంతి గదులు నిర్మిస్తానని హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరలక్ష్మీవ్రతం కార్యక్రమం సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, డాక్టర్ రాజేందర్ రెడ్డి దంపతులు రూ.20 లక్షలతో విశ్రాంతి గదుల నిర్మాణానికి ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి లతో కలిసి భూమి పూజ చేశారు. విశ్రాంతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల ఆలయ అర్చకులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఝాన్సీ రెడ్డి దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img