Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్కిషన్ నాయక్ కుటుంబానికి 'ఝాన్సీ రెడ్డి' పరామర్శ 

కిషన్ నాయక్ కుటుంబానికి ‘ఝాన్సీ రెడ్డి’ పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: మండలంలోని రామోజీ తండాకు చెందిన గుగులోత్ కిషన్ నాయక్ (70) సోమవారం పోచంపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి, కిషన్ నాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతుడి కుటుంబాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, చింతల భాస్కర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -