నవతెలంగాణ – పెద్దవంగర
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. పేదల పక్షపాతి ఝాన్సీ రెడ్డి అని అన్నారు. గత సుదీర్ఘకాలంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు, ఓరిగంటి సతీష్, బానోత్ గోపాల్, ముత్యాల పూర్ణచందర్, బానోత్ సీతారాం, దాసరి శ్రీనివాస్, అనపురం శ్రీనివాస్, ముత్తినేని శ్రీనివాస్, దుంపల శ్యాం, సంకెపల్లి రవీందర్ రెడ్డి, బీసు హరికృష్ణ, ఆవుల మహేష్, గద్దల ఉప్పలయ్య, లింగమూర్తి, చిలుక దేవేంద్ర, బెడద మంజూల, వెంకన్న, నరేష్, అంజయ్య, సంపత్, యాకయ్య, మల్లయ్య, వినోద్, రాంచరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES