Thursday, November 13, 2025
E-PAPER
Homeబీజినెస్జిమ్నీ లక్ష యూనిట్ల విక్రయం

జిమ్నీ లక్ష యూనిట్ల విక్రయం

- Advertisement -

ముంబయి : మారుతి సుజుకి కంపెనీ తన జిమ్నీ 5 డోర్‌ మోడల్‌ అమ్మకాల్లో నూతన మైలురాయిని సాధించినట్లు తెలిపింది. ఈ వాహనాన్ని విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష యూనిట్ల అమ్మకాలను చేరినట్లు పేర్కొంది. భారత్‌లో తయారైన జిమ్నీ 5 డోర్‌ మోడల్‌ ఎస్‌యువిని 100 దేశాలకు ఎగుమతి చేస్తోన్నట్లు తెలిపింది. 2023 నుంచి ఈ కారును జపాన్‌, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ అమ్ముతోన్నట్లు పేర్కొంది. ఫ్రాంక్స్‌ క్రాస్‌ఓవర్‌ తర్వాత జిమ్నీ 5 డోర్‌ ఇప్పుడు మారుతి సుజుకి ఎక్కు వగా ఎగుమతి చేస్తున్న రెండవ వాహనంగా మారిందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -