- Advertisement -
నాసిక్ : వచ్చే ఐదేండ్లలో రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్యుత్ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ వెల్లడించింది. తమ పరిశోధన అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), ఉత్పత్తి ఆవిష్కరణ, తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నట్టు పేర్కొంది. ఈ వ్యయాలు దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాన్ని ఆవిష్కరణలో ముందంజలో ఉండేందుకు దోహదం చేయనున్నాయని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సమ్‌కిత్ షా పేర్కొన్నారు. ఇందులో రూ.80-100 కోట్లు ఆర్‌అండ్‌డీ కోసం, మరో రూ.25 కోట్లను తయారీ ప్లాంట్ విస్తరణకు కేటాయించ నున్నామన్నారు.
- Advertisement -