Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీవో 99ను రద్దు చేయాలి 

జీవో 99ను రద్దు చేయాలి 

- Advertisement -

మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి రాకేష్ 
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి విఫల యత్నం 
అడ్డుకున్న పోలీసులు
తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా 
నవతెలంగాణ- పాలకుర్తి

రోస్టర్ పాయింట్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతుందని, జీవో 99 ని వెంటనే రద్దుచేసి మాలలకు, మాల ఉపకులాలకు న్యాయం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి ఎనమాల రాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా సోమవారం పాలకుర్తిలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి విఫల యత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.  మాల మహానాడు నాయకులను పోలీసు వాహనంలో తరలించారు. అనంతరం మండల కేంద్రంలో ని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ తరువాత జీవో 99 రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ గ్రూప్ 3 లోని అనుబంధ 26 కులాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో 99 ద్వారా ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా మాలలు నష్టపోతారని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా మాలలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మాలలను అన్ని రంగాల్లో అణచివేసేందుకే జీవో 99 ని తీసుకువచ్చారని విమర్శించారు. మాలలకు 6% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 99 ని వెంటనే రద్దు చసి మాలలకు న్యాయం చేయాలని, జీవో 99 ని రద్దు చేయకుండా మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల ఎస్సైలు దూలం పవన్ కుమార్, చింత రాజు, సృజన్ కుమార్ ల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జయ ప్రభాకర్, బత్తుల వెంకన్న, రాంపల్లి శ్రీనివాస్, ప్రవీణ్, లక్ష్మీ ప్రసన్న కుమార్, కట్ట నరసింహాలతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad