Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీవో 99 సవరించి మాలలకు న్యాయం చేయాలి 

జీవో 99 సవరించి మాలలకు న్యాయం చేయాలి 

- Advertisement -

– మాలల రణభేరి బహిరంగ సభ  పోస్టర్ ఆవిష్కరణ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునః సమీక్షించి జీవో 99 ను సవరించి మాలలతో పాటు గ్రూప్ 3 లోఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలని మాల మహానాడు  జిల్లా ఇంచార్జ్ బోజు రవీందర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ లో  మాలమహనాడు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నోముల బాలయ్య ఆధ్వర్యంలో హలో మాల చలో హైదరాబాద్  పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 23న సరూర్ నగర్ వేదికగా చేపట్టే బహిరంగ సభకు మాలలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సుప్రీం కోర్ట్ సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభా కనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. మాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి రూ 1000 కోట్ల నిధులను కేటాయించాలని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై శ్వేత విడుదల చేసి నిధులను ఖర్చు చేయనీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు యాస శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గ లీగల్ సెల్ అడ్వైజర్ చావుల రాజమౌళి , సావుల శ్రీనివాస్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ ఆరే శరత్ , లీగల్ సెల్ ఇంచార్జీ బోడుమల్ల సంపత్, నాయకు బత్తుల రాజయ్య, వెన్న రాజయ్య, మాశం కొమురయ్య, గిరిమల్ల ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -