- Advertisement -
- – చెరువులో తెగిపడిన విద్యుత్ తీగకు మరమ్మతులు
- – విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించిన అధికారులు
- నవతెలంగాణ – బెజ్జంకి
- మండల పరిధిలోని కల్లేపల్లి విద్యుత్ ఉప కేంద్రానికి విద్యుత్ సరఫరాయ్యే 11 కేవీ విద్యుత్ తీగ మండల కేంద్రంలోనీ ఊర చెరువులో తెగిపడిపొయింది. దీంతో ఉప కేంద్రం పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం మేర్పడింది. బెజ్జంకి మండల కేంద్రంలో జేఎల్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న కేంగర్ల భార్గవరాం గురువారం చెరువులో మద్యలోని విద్యుత్ స్తంభం వద్దకు ఈదుకుంటూ వెళ్లి తెగిపోయిన 11 కేవీ విద్యుత్ తీగక మరమ్మతులు చేశారు. అనంతరం అధికారులు ఉప కేంద్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. జేఎల్ఎం సాహసాన్ని ఏఈ మహేశ్, సిబ్బంది అభినందించారు.
- Advertisement -