Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను అమలు చేయాలి

ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను అమలు చేయాలి

- Advertisement -
  • – కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
    – సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్

    నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
    • ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్ అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం విద్రోహ దినంగా పాటిస్తు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. స్థానిక టీఎన్జీవోస్ భవనం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన ర్యాలీ ఎన్టీర్ చౌక్, కుమురం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి ఓపీఎస్ ను పునరుద్దరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అశోక్ మాట్లాడుతూ… 2024 సెప్టెంబర్ 1న సీపీఎస్ ను అమలు చేస్తు ఉత్తర్వులు వచ్చాయన్నారు.
    • రోజును ఉద్యోగ ఉపాధ్యయులు విద్రోహ దినంగా పాటిస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు నూతన పెన్షన్ విదానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు జేఏసీ ఆధ్వర్యంలో దశాల వారీగా ఆందోళనలు చేపడుతామన్నారు. జేఏసీ సెక్రటరీ జనరల్ శివకుమార్ మాట్లాడుతూ సిపిఎస్ అనేది ఉద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని జీవన భద్రతకు హాని కలిగిస్తోందని అన్నారు. వృద్ధాప్యంలో కనీస భరోసా కలిగించే పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం అని తెలిపారు. పలువురు జెఏసి నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో లక్షలాది మంది తరలివచ్చి హైదరాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ లోని ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు కే.కిష్టన్న, ఎ.నవీన్ కుమార్, మూగ శ్రీనివాస్, సోగల సుదర్శన్, మోతే శ్రీనివాస్, పన్నాల సంజీవరెడ్డి, బి.ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, జలంధర్ రెడ్డి, ఆడే నూర్సింగ్, కాంబ్లే విజయ్ కుమార్, తిరుమలు రెడ్డి, బెజ్జంకి రవీంద్ర, పుప్పాల నరేందర్, అశోక్, కార్యదర్శి, దిలీప్, లక్ష్మారెడ్డి ,రాజేందర్ దేశ్పాండే, సఫ్ధర్ అలీ, నర్సింలు, నర్సిములు, రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad