Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంఉద్యోగ కల్పన 20 శాతం పతనం

ఉద్యోగ కల్పన 20 శాతం పతనం

- Advertisement -

సంఘటిత రంగంలో అమాంతం క్షీణత
గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ రిపోర్ట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగ కల్పన అమాంతం మందగించింది. ఏడాదికేడాదితో పోల్చితే ఈ 2025 అక్టోబర్‌లో సంఘటిత రంగం (ఫార్మల్‌ జాబ్‌) కల్పనలో 20 శాతం పతనం చోటు చేసుకుంది. ఇంతక్రితం నెల సెప్టెంబర్‌ నియామకాలతోనూ పోల్చినా 5.4 శాతం తగ్గుదల నమోదయ్యిందని గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ‘ఇండీడ్‌’ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. దీంతో ఉద్యోగ కల్పనలో వరుసగా రెండవ నెల క్షీణత చోటు చేసుకున్నట్లయ్యింది. ఇండీడ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఉద్యోగ ప్రకటనల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. ఇది భారతదేశంలోని ఫార్మల్‌ ఎకానమీలో రియల్‌ టైమ్‌ నియామక కార్యకలాపాలను ట్రాక్‌ చేస్తుంది. ఇండీడ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గత మూడు నెలల్లో దాదాపు మూడు వంతుల రంగాలలో ఉద్యోగ ప్రకటనలు తగ్గాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో పోస్టింగ్‌లు 25.6 శాతం తగ్గాయి.

లీగల్‌ 22.4 శాతం, రిటైల్‌ 16.7 శాతం, లోడింగ్‌. స్టాకింగ్‌ 15 శాతం చొప్పున ఉద్యోగాల కల్పన తగ్గింది. మందగిస్తున్న ఉద్యోగ మార్కెట్లో కొన్ని రంగాలలో కొంత పురోగతి కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లో క్లీనింగ్‌, శానిటేషన్‌ ఉద్యోగ ప్రకటనలు దాదాపు 20 శాతం పెరిగాయి. కమ్యూనిటీ, సోషల్‌ సర్వీస్‌ (17.4 శాతం), డెంటల్‌ (13.1 శాతం), నర్సింగ్‌ (11.2 శాతం), ఫుడ్‌ ప్రిపరేషన్‌, సర్వీస్‌ (10.3 శాతం), హ్యూమన్‌ రిసోర్సెస్‌ (2.3 శాతం)లలో కూడా పెరుగుదల నమోదయ్యింది. అక్టోబర్‌లో 9.1 శాతం ఉద్యోగ ప్రకటనలలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఆయా సంస్థలు అవకాశాలను కల్పించాయని ఇన్‌డీడ్‌ పేర్కొంది. ఇది గత సంవత్సరం ఇదే నెల కంటే 7.6 శాతం ఎక్కువ. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధివిధానాలకు సంబంధించి యజమానుల వైఖరిలో మార్పులను రిమోట్‌ పని విధానాలలో మార్పులను ప్రతిబింబిస్తుందని ఇన్‌డీడ్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -