Friday, February 13, 2026
E-PAPER
Homeజాతీయంస్విస్‌లో ఉద్యోగాల కోత

స్విస్‌లో ఉద్యోగాల కోత

- Advertisement -

భారత్‌లో మూడు వేల మందికి ఉపాధి
యూబీఎస్‌ యోచన

న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ యూబీఎస్‌ మన దేశంలో సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. అదే సమయంలో అంతే సంఖ్యలో ఆ దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోతోంది. గతంలో ప్రత్యర్థిగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థ క్రెడిట్‌ సూయిస్‌ను యూబీఎస్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో వందలాది ఉద్యోగాలకు యూబీఎస్‌ కోత పెట్టబోతోంది. క్రెడిట్‌ సూయిస్‌ కొనుగోలుకు, ఉద్యోగాలలో కోతకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు యూబీఎస్‌ నిరాకరించింది. అయితే అలాంటిదేమీ లేదని బ్యాంక్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

క్రెడిట్‌ సూయిస్‌ను యూబీఎస్‌ 2023లో కొనుగోలు చేసింది. దీంతో స్విట్జర్లాండ్‌లో యూబీఎస్‌ ఏకైక ప్రధాన బ్యాంకింగ్‌ గ్రూపుగా మిగిలింది. తాజాగా స్విట్లర్లాండ్‌లో మూడు వేల ఉద్యోగాలకు కోత పెట్టబోతోంది. అనేక మంది పదవీ విరమణ చేయడమో లేదా స్వచ్ఛందంగా వైదొలగడమో జరుగుతుందని యూబీఎస్‌ సీఈఓ సెర్గియో ఎర్మోట్టి చెప్పారు. మన దేశంలో యూబీఎస్‌కు అనేక కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రాబోయే కాలంలో రెండు వేల నుంచి మూడు వేల మందిని తీసుకునే అవకాశం ఉంది. ఏఐ సహా సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచుకుంటామని, అదే సమయంలో కార్యకలాపాలను విస్తరిస్తామని ఎర్మోట్టి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -