Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో పనుల జాతర..

పల్లెల్లో పనుల జాతర..

- Advertisement -

గ్రామీణాభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పన..
పల్లెల్లో మౌలిక సదుపాయాల విస్తరణ..
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ – గండీడ్  
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన”పనుల జాతర” 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో  అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మహిళా సమైక్య భవనంలో మహిళా సంఘాల సభ్యులకు 9.5 కోట్ల రూపాయల చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  పంపిణీ చేశారు. అనంతరం కప్లాపూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, వెన్నాచేడ్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, సాలార్ నగర్ గ్రామంలో గ్రామపంచాయతీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ,తహసీల్దార్ మల్లికార్జున్ రావు,ఎంపీడీవో హరిచంద్ర రెడ్డి,మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad